తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అనూప్‌చంద్ర పాండే - election commission

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి అనూప్‌చంద్ర పాండే నియమితులయ్యారు. రాజ్యాంగంలోని అధికరణ 324(2) ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఆయన్ను నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ మంగళవారం తెలిపింది.

Anup Chandra Pandey
అనూప్‌చంద్ర పాండే

By

Published : Jun 9, 2021, 12:03 AM IST

Updated : Jun 9, 2021, 2:47 AM IST

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి అనూప్‌చంద్ర పాండేను కేంద్రం నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ నియామకం అమలులోకి వస్తుందని పేర్కొంది. 1984 బ్యాచ్‌ ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన అనూప్ చంద్ర.. గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. కేంద్ర సర్వీస్‌లలోని వివిధ హోదాల్లో అనూప్‌చంద్ర పనిచేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సునీల్‌అరోడా.. ఏప్రిల్‌ 12 న పదవీ విరమణ చేసిన నాటి నుంచి, ముగ్గురు సభ్యుల కమిషన్‌లో ఒక కమిషన్‌పదవి ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈ స్థానాన్ని అనూప్‌చంద్ర పాండేతో భర్తీ చేశారు.

ఇదీ చదవండి :దేశంలోని యువ రచయితలకు మోదీ పిలుపు

Last Updated : Jun 9, 2021, 2:47 AM IST

ABOUT THE AUTHOR

...view details