కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ ఎంపీ బాబుల్ సుప్రియో.. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు(babul supriyo news). టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.
గత నెలలో రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టు సంచలన ప్రకటన చేశారు బాబుల్. కేంద్ర కేబినెట్ విస్తరణ అనంతరం పదవి కోల్పోవడం వల్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం లేదని.. భాజపాకు రాజీనామా చేసి, ఎంపీగా కొనసాగుతానని వెల్లడించారు. ఈ పరిణామాల మధ్య శనివారం ఆయన టీఎంసీలో చేరడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
"రాజకీయాలు వదిలేస్తానని మనస్ఫూర్తిగా చెప్పాను. కానీ టీఎంసీలో చేరే అవకాశం లభించడం సంతోషాన్నిచ్చింది. రాజకీయాలను వదిలేయడం మంచి నిర్ణయం కాదని నా స్నేహితులు నాకు చెప్పారు. మనసు మార్చుకోవడంపై గర్వపడుతున్నా. బంగాల్‌కు సేవ చేసేందుకు నేను తిరిగొస్తున్నాను. మమతా బెనర్జీనిని సోమవారం కలుస్తా. నాకు దక్కిన స్వాగతాన్ని చూసి సంతోషిస్తున్నా."