తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ దినేశ్ త్రివేది.. భాజపాలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బంగాల్లో జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ బడ్జెట్ తొలి దఫా సమావేశాల్లో రాజ్యసభ వేదికగానే తన రాజీనామా ప్రకటన చేశారు త్రివేది.
కొన్ని పార్టీల్లో కుటుంబాలకే ప్రాధాన్యం ఉందని, కానీ భాజపాలో ప్రజలకే అత్యున్నత స్థానమని చెప్పారు త్రివేది. ఈ అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. కరోనా సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు స్వాగతించదగినదని అన్నారు.