పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్(amarinder singh news) దిల్లీ పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైంది. దేశ రాజధానిలో.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం సాయంత్రం ఆయన భేటీ అవుతారన్న(amarinder singh bjp) ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎంగా ఇటీవల రాజీనామా చేసిన సమయంలోనే కాంగ్రెస్‌పై అమరీందర్ బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం.. తాజా పరిస్థితులకు మరింత బలం చేకూరుస్తోంది.
మరికొన్ని నెలల్లో పంజాబ్‌కు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి(punjab election 2022). అంతలోనే ఈ నెల 18న ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తనను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. సీఎంగా రాజీనామా చేస్తానని అనేక నెలల ముందే సోనియాకు చెప్పినా.. అప్పుడు వద్దని, ఇప్పుడు తప్పించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అమరీందర్ సింగ్ రాజీనామా అనంతరం పంజాబ్ కాంగ్రెస్ దళిత అస్త్రాన్ని ప్రయోగించింది. దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిని చేసింది. అమరీందర్ ప్రత్యర్థి.. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూకు చన్నీ అత్యంత సన్నిహితుడు.
ఇదీ చూడండి:-ఓటు కోసం 'దళిత' వ్యూహం- దేశంలో నయా రాజకీయం!