భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకు అత్యంత విశ్వాసపాత్రుడైన రామ్ ఖండేకర్(87) ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాగ్‌పుర్‌లో కన్నుమాశారు. పీవీతో పాటు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యశ్వంత్‌రావు చవాన్ వద్ద ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. పీవీ మరణించేంత వరకు ఆయన వద్దే ఖండేకర్ విధులు నిర్వర్తించారు.
ఈ ఇరువురు నేతలతో కలిసి రామ్ ఖండేకర్ 40 ఏళ్లకుపైగా పని చేశారు. 1985లో మహారాష్ట్ర నాగ్‌పుర్ జిల్లా రామ్‌తేక్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటుకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 1991లో పీవీ నర్సింహారావు ప్రధాని పదవి చేపట్టగా.. రామ్ ఖండేకర్‌ను తన ప్రైవేట్ సెక్రటరీగా నియమించుకున్నారు.