మృతి చెందిన తన కుటుంబసభ్యుల జ్ఞాపకార్థం తమిళనాడులోని మైలదుతురైకు చెందిన మాజీ పోలీస్ అధికారి మదన్ మోహన్.. ఇంటి ముందు గుడి కట్టింటి.. వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. తన భార్య వర్ధంతి సందర్భంగా 101 లీటర్ల పాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి అతని బంధువులు పెద్ద సంఖ్యంలో హాజరయ్యారు.
తల్లి, భార్యపై ప్రేమతో ఇంటి ముందే గుడి - తల్లి జ్ఞాపకంగా గుడి
తమిళనాడుకు చెందిన ఓ మాజీ పోలీస్ అధికారి... మృతిచెందిన తన భార్య, తల్లి జ్ఞాపకంగా ఇంటి ముందే గుడి కట్టి.. వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. బుధవారం.. భార్య వర్ధంతి సందర్భంగా 101 లీటర్ల పాలతో విగ్రహాలకు అభిషేకం చేశారు.
తల్లి, భార్యపై ప్రేమతో ఇంటి ముందే గుడి
మదన్ మోహన్ భార్య మీనాక్షీఅమ్మల్ (61) అనారోగ్యం కారణంగా 2019 సెప్టెంబరు 27న ప్రాణాలు కోల్పోయింది. 40 ఏళ్ల పాటు తనతో కలిసి జీవించిన మీనాక్షిఅమ్మల్ జ్ఞాపకంగా.. ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావించారు 72 ఏళ్ల మదన్. ఈ నేపథ్యంలో ఆమె ప్రథమ వర్ధంతి సందర్భంగా మీనాక్షీ సహా ఆయన తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి :భార్యపై ప్రేమతో.. ఇంట్లోనే నిలువెత్తు విగ్రహం