బలవంతపు వసూళ్ల కేసులో కొంతకాలంగా పరారీలో ఉన్న మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ముంబయిలో ప్రత్యక్షమయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తునకు సహకరించేందుకుగాను చండీగఢ్ నుంచి ఆయన వచ్చినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ముంబయి విమానాశ్రయం నుంచి నేరుగా నేర విభాగం కార్యాలయానికి వెళ్లిన పరమ్‌బీర్ సింగ్ నుంచి గోరెగావ్ ఠాణాలో నమోదైన బలవంతపు వసూళ్ల కేసులో వాంగ్మూలం తీసుకున్నారు అధికారులు.
బలవంతపు వసూళ్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. పోలీసులు అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు నుంచి రక్షణ పొందారు(parambir singh news).
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన ఎస్యూవీ నిలిపివేత, వ్యాపారవేత్త మన్‌సుఖ్ హిరేన్ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టయ్యారు. ఆ తర్వాత ముంబయి పోలీసు కమిషనర్‌గా ఉన్న పరమ్‌బీర్ సింగ్‌ను మహారాష్ట్ర సర్కార్ బదిలీ చేసింది. అప్పటి నుంచి ఆయన అదృశ్యమయ్యారు. ఈ ఏడాది మే తర్వాత ఒక్కసారి కూడా ఆఫీస్‌కు వెళ్లలేదు(parambir singh mumbai police).
ముంబయికి వచ్చిన పరమ్‌బీర్ సింగ్‌పై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ విమర్శలు గుప్పించారు. కోర్టు ఆయన్ను పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించినందువల్లే విచారణకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని పరమ్‌బీర్ సింగ్ కోర్టుకు చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు(param bir singh news).
హోంమంత్రి షాక్..