తెలంగాణ

telangana

By

Published : Apr 27, 2021, 5:14 PM IST

ETV Bharat / bharat

మాజీ ప్రధాని మేనకోడలు కరోనాతో మృతి

దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ మేనకోడలు, కాంగ్రెస్ నాయకురాలు కరుణా శుక్లా కొవిడ్​తో మరణించారు.

Karuna Shukla
కరుణ శుక్ల

మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్​పేయీ మేనకోడలు కాంగ్రెస్ నేత కరుణా శుక్లా(70) కొవిడ్​తో సోమవారం రాత్రి ఛత్తీస్​గఢ్ రాయ్​పుర్​ ఆసుపత్రిలో మరణించారు. కొద్ది రోజుల క్రితం ఆమెకు కరోనా సోకగా రామకృష్ణ ఆసుపత్రిలో చేర్పించారు.

కరుణ మృతి పట్ల ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ దేవ్ సంతాపం తెలిపారు.

1950 ఆగస్టు 1న మధ్యప్రదేశ్ గ్వాలియర్​లో కరుణ జన్మించారు. చదువులు పూర్తయ్యాక రాజకీయాల్లో చేరారు. భాజపాలో జాతీయ ఉపాధ్యక్షురాలు సహా అనేక పదవుల్ని చేపట్టారు. భాజపా జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేగా 1993లో భాజపా నుంచి ఎన్నికయ్యారు. ఉత్తమ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు.

2004 లోక్​సభ ఎన్నికల్లో భాజపా నుంచి మధ్యప్రదేశ్ జంజీర్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో ఓడిపోయారు. 32 ఏళ్లు భాజపాలో కొనసాగి 2014లో కాంగ్రెస్​లో చేరారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బిలాస్ పుర్ నుంచి ఆమెను కాంగ్రెస్ బరిలో దింపగా.. ఓడిపోయారు.

ఇదీ చదవండి:స్ట్రెచర్​ లేక స్కూటీపైనే ఐసీయూకు కొవిడ్ రోగి

ABOUT THE AUTHOR

...view details