తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరమ్​Xదేశ్​ముఖ్​- 'మహా'లో లేఖ దుమారం - ముంబయి మాజీ కమిషనర్​ పరమ్​బీర్​ సింగ్

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ తన పదవిని దుర్వినియోగం చేశారని ముంబయి మాజీ పోలీస్​ కమిషనర్​ పరమ్​బీర్​ సింగ్​ ఆరోపించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే​కు పరమ్ రాసిన లేఖ దుమారానికి దారి తీసింది. హోం మంత్రి రాజీనామా చేయాలని భాజపా డిమాండ్​ చేసింది.

Former Mumbai Police Commissioner Param Bir Singh writes to Maharashtra CM Uddhav Thackeray claiming Home Minister Anil Deshmukh
పరమ్​Xదేశ్​ముఖ్​- 'మహా'లో లేఖ దుమారం

By

Published : Mar 20, 2021, 7:39 PM IST

Updated : Mar 20, 2021, 10:59 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేకు ముంబయి మాజీ పోలీస్​ కమిషనర్ పరమ్​బీర్​ సింగ్ రాసిన లేఖ తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. హోమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు పరమ్​బీర్​ సింగ్​. కాగా ఆయన ఆరోపణలను దేశ్​ముఖ్​ ఖండించారు. మరోవైపు ఈ పుర్తి వ్యవహారంపై విచారణ చేపట్టాలని భాజపా నేత ఫడణవీస్​ డిమాండ్​ చేశారు.

'నెలకు రూ. 100కోట్లు...'

లేఖల్​ తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ముంబయి మాజీ పోలీస్​ కమిషనర్​. నెలకు​ రూ.100 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు.. పోలీసు అధికారి సచిన్​ వాజేతో హోంమంత్రి చెప్పారని పేర్కొన్నారు.

'పరమ్​ భయపడుతున్నారు...'

పరమ్​ ఆరోపణలను హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ ఖండించారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసుతో పాటు మన్​సుఖ్​ హిరేన్​ మృతి కేసులో విచారణ జరుగుతోందని.. అది చూసి పరమ్ భయపడుతున్నారని ఆరోపించారు. అవి ఆయనవైపునకు వస్తున్నాయనే కారణంతోనే.. తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

తనపై పరమ్​బీర్​ సింగ్​ చేసిన ఆరోపణలను నిరూపించాలని అనిల్​ దేశ్​ముఖ్​ అన్నారు. పరమ్​పై పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు.

'హోంమంత్రి రాజీనామా చేయాలి...'

పరమ్​బీర్​ సింగ్​ లేఖ నేపథ్యంలో భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హోం మంత్రి రాజీనామా చేయాలని లేదా.. ఆయనను ముఖ్యమంత్రే తొలగించాలని భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ డిమాండ్​ చేశారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని అన్నారు. హోంమంత్రిపై ఆరోపణల గురించి సీఎంకు ముందే తెలిసినా.. ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు నేపథ్యంలో.. ముంబయి పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే బదిలీ చేసింది. పరమ్‌బీర్‌ సింగ్‌ స్థానంలో హేమంత్‌ నగ్రాలేను నియమించింది.

కారు యజమానిగా పేర్కొన్న మాన్సుఖ్​ హిరెన్​ మృతి, అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలకు సంబంధించి అనుమానిస్తూ పోలీస్​ అధికారి వాజేను ఎన్​ఐఏ ఇటీవలే అరెస్ట్​ చేసింది. అంబానీ నివాసం వద్ద సీసీటీవీలో కనిపించిన వ్యక్తి వాజేనే అనిఏన్​ఐఏ అనుమానిస్తోంది.

ఇదీ చూడండి:వాజేను 'మహా' సర్కారే​ కాపాడుతోంది: ఫడణవీస్

Last Updated : Mar 20, 2021, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details