కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభంతో భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. లాక్డౌన్ కారణంగా అనేక వర్గాలపై తీవ్ర ప్రభావం పడింది. వైరస్ బారిన పడకుండా భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితి తెలెత్తింది. ఈ విపత్కర పరిస్థితిలో ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహం విలాసవంతంగా, భారీ ఎత్తున జరగడం వివాదాస్పదంగా మారింది.
తమిళనాడు మదురైలో ఏఐఏడీఎంకే నేత, మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహం జరిగింది. పెళ్లి జరిగిన భవనంలోని ఒక పెద్ద గది మొత్తం ప్లాస్టిక్, వెండి, బంగారు పాత్రలు, టీవీలు, మిక్సర్లు, గ్రైండర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు సహా కొత్త వాహనాలు ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి కానుకగా ట్రాక్టర్లు ఇవ్వడం గమనార్హం.