తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముఖ్యమంత్రిని కాల్చేస్తా.. మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక - Former MLA wife has warned to kerala CM Pinarayi Vijayan

కేరళ సీఎంను తుపాకీతో కాల్చేస్తానని బహిరంగంగా బెదిరింపులు చేశారు ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే భార్య. తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని.. దీని వెనుక సీఎం హస్తం ఉందని ఆమె ఆరోపించారు.

gun
gun

By

Published : Jul 4, 2022, 4:48 AM IST

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్‌ భార్య ఉషా జార్జ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను సీఎం పినరయి విజయన్‌ వేధిస్తున్నారని, తుపాకీతో ముఖ్యమంత్రిని కాలుస్తానని ఆమె బహిరంగంగా బెదిరింపులు చేశారు. లైంగిక వేధింపుల కేసులో పీసీ జార్జ్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ సందర్భంగా ఉషా జార్జ్‌ మాట్లాడుతూ.. తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని, దీని వెనుక సీఎం హస్తం ఉందని ఆరోపించారు. ఈ మేరకు మీడియాతో ఆమె ఆదివారం మాట్లాడారు.

‘‘ఇదొక తప్పుడు కేసు. కేరళ సీఎం నా భర్తను, కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నా భర్త చాలా అమాయకుడు. సీఎం అవినీతిని బయటపెట్టినందుకే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. మా నాన్న రివాల్వర్‌తో సీఎంను కాల్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని ఉషా జార్జ్ హెచ్చరించారు.

గతంలో సీఎం పినరయి విజయన్‌పై పీసీ జార్జ్‌ అవినీతి అభియోగాలు మోపారు. వ్యాపారవేత్త ఫారిస్‌ అబూబకర్‌తో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను అభ్యర్థించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details