తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Ganta Srinivasa Rao Arrested: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్టు..! - A case of skill development

Ganta_Srinivasa_Rao_Arested
Ganta_Srinivasa_Rao_Arested

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 8:53 AM IST

Updated : Sep 9, 2023, 8:21 PM IST

08:51 September 09

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్టు

Former Minister Ganta Srinivasa Rao Arrested:స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్​ నేపథ్యంలో... తెలుగుదేశం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయాన్నే విశాఖలోని ఆయన ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. గంటా శ్రీనివాసరావును ఎండాడలోని దిశ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్​.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు

Chandrababu Arrest in Nandyala :తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ CID అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించిన కేసులో అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయనకు నోటీసులు ఇచ్చారు. కేసుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సమర్పించాలని పోలీసులను చంద్రబాబు కోరారు. అందుకు సంబంధించిన వివరాలు, రిమాండ్‌ రిపోర్టు తర్వాత ఇస్తామని CID అధికారులు చెప్పారు. ఆ వివరాలు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని చంద్రబాబు, ఆయన తరఫు న్యాయవాదులు పోలీసులను నిలదీశారు. చంద్రబాబుఏం తప్పుచేశారో నోటీసుల్లో లేదంటున్న న్యాయవాదులు.. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా ప్రణాళిక ప్రకారం అరెస్టు చేస్తున్నారు.. ఎవరెన్ని కుట్రలు పన్నినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని అన్నారు. ఇప్పటికే కొన్నివందల మందిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. కార్యకర్తలు సంయమనం పాటించండని సూచించారు. నా హక్కులు దెబ్బ తీస్తున్నారు.. నాకు న్యాయం జరగే వరకు పోరాడతానని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబుకు అనారోగ్యం.. అయినా ఆగని అరెస్టు... జగన్‌ సైకో పాలనపై నిరసనలు

Tension in Nandyala: నంద్యాలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుబస చేసిన బస్సు వద్దకు పోలీసు బలగాలు పెద్దసంఖ్యలో వెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. రాత్రి నంద్యాల బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు.. RK ఫంక్షన్ హాల్‌ వద్ద బస చేశారు. తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో.. అనంతపురం DIG రఘురామిరెడ్డి నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబును కలవాలంటూ NSG సిబ్బందిని రఘురామిరెడ్డి కోరారు. ఈ సమయంలో కలవాల్సిన పనేంటని పక్కనే ఉన్న తెలుగుదేశం నాయకులు ప్రశ్నించారు. మీకెందుకు చెప్పాలంటూ రఘురామిరెడ్డి ఎదురు ప్రశ్నించారు. కేసుతో మీకేం సంబంధం అంటూ వాదించారు. అసలు కేసేంటో చెప్పాలంటూ తెలుగుదేశం నేతలు రఘురామిరెడ్డిని నిలదీశారు.

Live Updates : నేను ఏ తప్పూ చేయలేదు.. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణిచివేస్తున్నారు: చంద్రబాబు

Protests Across the State in the Wake of Chandrababu Arrest:ఈ సందర్భంగా రాష్ట్రం వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉండటంతో పోలీసులు ఎక్కడికక్కడ బస్సులు నిలిపివేశారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిపివేశారు. పోలీసులు హెచ్చరికలతో 10 గంటల తర్వాత బస్సులు బయటకు తీస్తామని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఆకస్మికంగా బస్సులు నిలిపివేయడంపై ప్రశ్నిస్తున్నారు. ఉదయం నుంచి వెళ్లవలసిన ఆగిపోవడంతో ప్రయాణికులు వెనుతిరుగుతున్నారు. ఇంక తెలుగుదేశం నాయకులను గృహ నిర్బంధం చేస్తున్నారు. దీంతో రాష్ట్రం వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Last Updated : Sep 9, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details