మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ జైలు నుంచి బయటకు వచ్చారు. అవినీతి కేసులో ఆయనకు మంజూరు చేసిన బెయిల్పై స్టే పొడగించేందుకు బాంబే హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో దేశ్ముఖ్.. జైలు నుంచి విడుదలయ్యారు. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ సహా పలువురు నాయకులు ఆయనకు జైలు బయట ఆహ్వానం పలికారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని దేశ్ముఖ్ పేర్కొన్నారు. 'న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నన్ను తప్పుడు కేసులో ఇరికించారని హైకోర్టు సైతం అభిప్రాయపడింది. ఎవరో చెబితే విని.. నాపై చేసిన ఆరోపణలు చేసినట్లు పరంబీర్ సింగ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ లేవు' అని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అనిల్ దేశ్ముఖ్ వ్యాఖ్యానించారు.
మాజీ హోంమంత్రికి రిలీఫ్.. అవినీతి కేసులో ఏడాది తర్వాత జైలు నుంచి విడుదల - జైలులో అనిల్ దేశ్ముఖ్
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఏడాదికి పైగా జైల్లో ఉన్న ఆయన.. తాజాగా విడుదలయ్యారు.
బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్ముఖ్ ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. ఈ కేసులో 2021 నవంబర్ నుంచి అనిల్ దేశ్ముఖ్(73) జైల్లోనే ఉన్నారు. ముంబయి మాజీ సీపీ పరంబీర్ సింగ్ ఈ ఆరోపణలు చేయగా.. దీనిపై తొలుత సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఆయనపై చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ లభించింది. తాజాగా, సీబీఐ కేసులో బెయిల్పై బయటకొచ్చారు.