సీనియర్ అడ్వొకేట్, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి శాంతి భూషణ్ కన్ను మూశారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన.. 97 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా 2009లో ఆయన పేరు దక్కించుకున్నారు. ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఈయన కుమారుడే.
కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత
కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి శాంతి భూషణ్ తుదిశ్వాస విడిచారు. 97 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు.
1925 నవంబర్ 11న ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జన్మించారు శాంతి భూషణ్. 1977 నుంచి 1979 మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. ఇందిరాగాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని సవాల్ చేసిన రాజ్‌నారాయణ్ తరఫున అలహాబాద్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులోనే ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది. ఇందిరాగాంధీతో విభేదాలు ఏర్పడి చీలిపోయిన కాంగ్రెస్ (ఓ) పార్టీలో కీలకంగా పనిచేశారు. అనంతరం జనతా పార్టీలో, 1980లో భాజపాలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో శాంతి భూషణ్ ఒకరు.
TAGGED:
శాంతి భూషణ్ మృతి