దేశంలో కరోనా కేసుల సంఖ్య(Corona cases) తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా.. కేసుల సంఖ్య గణనీయంగానే ఉందన్నారు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్కే గంగూలీ. రానున్న పండుగల సమయంలో అజాగ్రత్త వహిస్తే.. ముప్పు(covid during festivals) మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈటీవీ భారత్తో ముఖాముఖీలో పలు విషయాలు వెల్లడించారు.
" కేసుల సంఖ్య తగ్గుతున్నప్పుటికీ.. భారత్లో ఆ సంఖ్య గణనీయంగానే ఉంది. కొన్ని ప్రాంతాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశంలో ప్రయాణాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే లక్షణాలు లేని వారు(covid asymptomatic cases) వైరస్ను వ్యాప్తి చేయొచ్చు. పండుగల వేళ అజాగ్రత్తగా వ్యవహరిస్తే.. కేసులు పెరిగే అవకాశం ఉంది(covid during festivals). దీపావళి నాటికి దానిని తొలగించాలంటే.. అప్పటి వరకు వయోజనులకు టీకాల పంపిణీ పూర్తి చేయాలి. అప్పుడే మనం సురక్షితంగా ఉండగలం. ముఖ్యంగా పండుగల సీజన్లో ప్రజలు కొవిడ్-19 నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఈ సమయంలోనే పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటం, మాస్కులు ధరించకపోవటం వంటివి జరుగుతాయి. అది సమస్యలకు దారి తీస్తుంది. కేసుల పెరుగుదలకు కారణమవుతుంది."