తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పది నెలల్లోనే కరోనా టీకా సాధ్యమైందిలా'

ఏదైనా వ్యాధికి టీకా అభివృద్ధి చేయాలంటే సాధారణ విషయం కాదు. ఒక్కోసారి 10 సంవత్సరాలైనా టీకా పూర్తిగా అభివృద్ధి చేయడం కష్టమే. అయితే కరోనా విషయంలో మాత్రం శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టించారు. ఒకటి కాదు రెండు కాదు. పదుల సంఖ్యలో టీకాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే వేగంగా తయారు చేసినప్పటికీ కరోనా వ్యాక్సిన్ సురక్షితంగానే ఉంటుందని ఐసీఎంఆర్ మాజీ చీఫ్ ఎన్​కే గంగూలీ హామీ ఇస్తున్నారు.

ICMR chief N K Ganguly
కరోనా టీకా ఎన్​కే గంగూలీ

By

Published : Nov 27, 2020, 10:05 PM IST

అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నప్పటికీ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధనా సంస్థ(ఐసీఎంఆర్) మాజీ చీఫ్ ఎన్​కే గంగూలీ స్పష్టం చేశారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. వ్యాక్సిన్ విడుదలకు సీరం సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. భారత్​లో జనవరి నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 9 నుంచి పది నెలల్లోనే కరోనా టీకా అందుబాటులోకి రావడంపై కీలక వ్యాఖ్యలు చేశారు గంగూలీ.

ఈటీవీ భారత్​ ప్రతినిధితో ఎన్​కే గంగూలీ

ABOUT THE AUTHOR

...view details