మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బుధవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా 10 గంటలకు డీఆర్డీఓ అతిథి గృహానికి చేరుకున్నారు.
ముంబయి పోలీస్ మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్, మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే.. దేశ్‌ముఖ్‌పై చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది.