మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ చెన్నైలో అరెస్టయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులు, వారి జీవితభాగస్వాములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
న్యాయమూర్తుల ప్రవర్తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇటీవలే ఓ వీడియోను విడదల చేశారు జస్టిస్ కర్ణన్. దీనిపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. మహిళలను అగౌరపరిచే విధంగా జస్టిస్ కర్ణన్ ఆరోపణలు చేశారని, ఆయనపై చర్యలు చేపట్టాలని మద్రాసు హైకోర్టులోని సీనియర్ న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకు లేఖ రాశారు.