తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీనియర్ బిషప్ డాక్టర్ ఫిలిప్పోస్ కన్నుమూత - భారత బిషప్ కన్నుమూత

మలంకర మర్ థోమ సిరియన్ చర్చి​ మాజీ పాస్టర్​, భారత్​లో ఎక్కువ కాలం బిషప్​గా ఉన్న డాక్టర్. ఫిలిప్పోస్ మర్ క్రిసోస్టమ్ మృతిచెందారు. కుంబానంద్​లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

Dr Phillipose Mar Chrysostom
డాక్టర్ ఫిలిప్పోస్

By

Published : May 5, 2021, 11:05 AM IST

మలంకర మర్​ థోమ సిరియన్ చర్చి మాజీ పాస్టర్​, భారత్​లో ఎక్కువ కాలం బిషప్​గా పనిచేసిన డాక్టర్. ఫిలిప్పోస్ మర్ క్రిసోస్టమ్ మృతిచెందారు. 103 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా ఆయన కుంబానంద్​లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈయన అంత్యక్రియలు గురువారం జరపనున్నారు.

మోదీతో డాక్టర్. ఫిలిప్పోస్

ప్రపంచలోనే ఎక్కువ కాలం బిషప్​గా పనిచేసిన ఘనత డా. ఫిలిప్పోస్​ సొంతం. ఈయన 68 ఏళ్లపాటు బిషప్​గా పనిచేశారు. 1999లో ఈయన మలంకర మర్ థోమ సిరియన్​ చర్చ్​ పెద్దగా 1999లో నియమితులయ్యారు. 2018లో ఈయన రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషన్ అవార్డను పొందారు.

డాక్టర్ ఫిలిప్పోస్ మర్ క్రిసోస్టమ్

డాక్టర్. ఫిలిప్పోస్ మర్ క్రిసోస్టమ్ ఏప్రిల్ 27 1918లో జన్మించారు. 1944లో మథోమా చర్చి ప్రీస్ట్ అయ్యారు.

ఇదీ చదవండి:'ఓడిపోయినప్పటికీ సీఎం పదవి ఎలా చేపడతారు'

ABOUT THE AUTHOR

...view details