Former Cricketer Ambati Rayudu Quit YSRCP :ఏపీలో అధికార వైఎస్సార్సీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీని వీడుతున్నట్లు మాజీ భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ (X) చేశారు. "రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా" అని తెలిపారు.
గ్రౌండ్లోకి వెళ్లకుండానే రాయుడు డక్కౌట్ : డిసెంబర్ 28న వైఎస్సార్సీపీ అధినేత జగన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీలో చేశారు. పార్టీలో అడుగు పెట్టిన పది రోజుల్లోనే పార్టీ నుంచి యూటర్న్ తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ కొద్ది సమయంలోనే పార్టీ వీడటంతో రాజకీయ నిపుణలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో వికెట్ పడటంతో అధికార వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
Narasaraopet MP Krishnadevarayulu Sensational Comments: వైఎస్సార్సీపీలో మార్పులు, చేర్పులు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో నరసరావుపేట ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం వాస్తమేనని చెప్పిన ఆయన ఈసారి తనను నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందన్నారు. అయితే ఆయనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో 'అధిష్టానం లెక్కలు వేరు, నా లెక్కలు వేరు'అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తానని పేర్కొన్నారు.
'అధిష్టానం లెక్కలు వేరు - నా ఆలోచనలు వేరు': ఎంపీ కృష్ణదేవరాయులు సంచలన వ్యాఖ్యలు