Former CBI Director Comments on Remand Report:తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ధ్నరాలు రాస్తారోకొలు చేస్తున్న నేపథ్యంలో... చంద్రబాబుకు మద్ధతుగా పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయి. రాజకీయ నాయకులే కాంకుండా... వివిధ రంగాలకు చెందిన పలువురు మేదావులు సైతం చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబడుతున్నాయి. తాజాగా చంద్రబాబు(Chandrababu) అరెస్టుకు సంబంధించి కోర్టులో సీఐడీ(CID) దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టుపై... సీబీఐ మాజీ డైరెక్టర్(Ex-CBI director) ఎం.నాగేశ్వరరావు స్పందించారు.
CID Remand Report: రిమాండ్ రిపోర్టు అంతా కాకమ్మ కథలా ఉందని, నాగేశ్వరరావు అన్నారు. అధికారలు తప్పుడు సమాచారంతో కోర్టులో వాదనలు వినిపించారని ఆయన ఆరోపించారు. కేసుకు సంబంధం లేని ఉదాహరణలు కోర్టులో ప్రస్తావించారన్నారు. వేర్వేరు కేసులో ఇచ్చిన తీర్పులు తప్పుగా చెప్పారన్న నాగేశ్వరరావు(Nageswara Rao), వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను తప్పుగా ప్రస్తావించారన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మెుదలైన ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
Chandrababu CID Remand Report:రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే.. ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చిన సీఐడీ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో రిమాండ్ రిపోర్టు సమర్పించింది. రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును ఏ 37 గానే పేర్కోంటునే అభియోగాలను పేర్కోంది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారానికి సంబంధించిన నేరంలో ఆయనే ముఖ్యమైన కుట్రదారని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పేర్కోంది. 2021 డిసెంబరు 9 కంటే ముందు ఈ నేరం జరిగిందని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేంద్రంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ అక్రమాలు జరిగాయని వెల్లడించింది.