బంగాల్ మాజీ ముఖ్యమంత్రి, వామపక్ష సీనియర్ నేత బుద్దదేవ్ భట్టాచార్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు.
"ఆయనకు చికిత్స అందిస్తున్నాం. అత్యవసర పరీక్షలు జరుపుతాం. అనంతరం వచ్చిన ఫలితాలు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆధారంగా తదుపరి వైద్యం చేస్తాం."
- ఆసుపత్రి వర్గాలు