తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్యాచారం కేసులో మాజీ మంత్రి అరెస్ట్ - తమిళనాడు మంత్రి ఎం.మణికందన్ అరెస్ట్

తమిళనాడు మాజీ మంత్రి ఎం.మణికందన్​ను చెన్నై పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. మలేసియాకు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Former AIADMK minister M Manikandan arrested in Bengaluru by Chennai City Police
అత్యాచారం కేసులో మాజీ మంత్రి అరెస్ట్

By

Published : Jun 20, 2021, 10:07 AM IST

Updated : Jun 20, 2021, 10:14 AM IST

తమిళనాడు మాజీ మంత్రి, ఏఐఏడీఎంకే పార్టీ నేత ఎం.మణికందన్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. మలేసియాకు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడటం, ఆమె గర్భస్రావానికి కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు, సదరు మహిళను మణికందన్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో మణికందన్​కు.. మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిందని తమిళనాడు పోలీసులు తెలిపారు. దీంతో గత కొన్నాళ్లుగా అరెస్టు నుంచి తప్పించుకుంటున్న ఆయన్ను బెంగళూరులో అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

Last Updated : Jun 20, 2021, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details