1947లో మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే అందరికీ తెలుసు. దేశమాత విముక్తికి జరిగిన పోరాటానికి 1857కంటే వందేళ్ల ముందే బీజం పడిందని ఎందరికి తెలుసు? ఝన్సీరాణి లక్ష్మీ బాయి కంటే ముందే ఓ వీరనారి దేశంకోసం ప్రాణాలర్పించిన వీరనారి, రామ్ గఢ్ రాణి అవంతీబాయి. బ్రిటిష్ వాళ్లు ఆమె తిరుగుబాటును అణచివేసి ఉండవచ్చు. కానీ అవంతీబాయి పోరాటం ఒక బలమైన సందేశాన్నిచ్చింది. అది రవి అస్తమించే బ్రిటీష్ రాజ్యం కావటం తథ్యమని చాటింది.
ఇవాళ విశ్వమంతా మహిళలు సమానత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. వీరంతా రాణి అవంతిబాయి వీరోచిన పోరును స్ఫూర్తిగా తీసుకోవాలి. 1857కు వందేళ్లముందే స్వాతంత్ర్యోద్యానికి ఊపిరి అందించిన వీరనారి అవంతిబాయి. భరతమాత విముక్తికి ప్రాణాలర్పించీ గుర్తింపులేని యోధురాలిగా మిగిలిపోయారు.
భారతీయుల్లో స్వాతంత్యకాంక్షకు బీజం వేసిన రాణి అవంతిబాయి.. 1831 ఆగస్టు 16న మధ్యప్రదేశ్ లోని సియోనిజిల్లా మాంఖేడిలో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఆమెకు అంతో బాయి అని పేరుపెట్టారు. అల్లారుముద్దుగా పెంచి విద్యతో పాటు యుద్ధవిద్యలూ నేర్పించారు. ఆనాడు ఆదరణపొందిన కత్తియుద్ధం, విలువిద్య, సైనిక వ్యూహాం, దౌత్యనీతి అన్నీ నేర్చింది. ఆమెకు 1848లో రామ్ గఢ్ సంస్థాన మహారాజు కుమారుడు విక్రమాదిత్య సింగ్ తో వివాహమైంది. వివాహనంతరం తన పేరును అవంతీబాయిగా మార్చుకుంది.
రాణి అసలు పేరు అంతో బాయి. అత్తవారింట ఆమె పేరు అవంతిబాయిగా మారింది. రామ్‌గఢ్ చరిత్రలో ఆమె పేరు అవంతిబాయిగా మాత్రమే నమోదైంది. ఆమె మామగారి పేరు లక్ష్మణ్ సింగ్. ఆయన కుమారుడు, అవంతి భర్త విక్రమాదిత్య సింగ్.
-నరేశ్, చరిత్రకారుడు, రచయిత
రామ్‌గఢ్ మహారాజు లక్షణ్ సింగ్ మరణించారు. కుమారుడు విక్రమాదిత్య మహారాజయ్యారు. కానీ కొద్ది సంవత్సరాలకు రాజా విక్రమాదిత్య సింగ్ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. విక్రమాదిత్యకు, అవంతిబాయికి అమన్ సింగ్, షేర్ సింగ్ అనే ఇద్దరు కుమారులున్నారు. కానీ చిన్న వయస్సులో ఉండటంతో ..మహారాణి అవంతిబాయి రాజ్యపాలన చేపట్టారు. రాజుల్లేని రాజ్యాల ఆక్రమణకు బ్రిటిషర్లు రాజ్యసంక్రమణ సిద్ధాంత ఎత్తుగడ వేశారు. అవంతిబాయిని మహారాణిగా గుర్తించడానికి నిరాకరిస్తూ..ప్రత్యేక పరిపాలకుణ్ణి నియమించారు.
విక్రమాదిత్యసింగ్ మరణానంతరం ఓ క్లిష్ట సమస్య మహారాణి ముందుకు వచ్చింది. ఇద్దరు కుమారులు చిన్నవాళ్లు. ఢిల్లీలో కూర్చుని రాజ్యాన్ని కబళించటమే లార్డ్ డల్హౌసీ విధానం. రాజ్యస్వాధీనానికి కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ను అమలుచేశారు.
- నరేశ్, చరిత్రకారుడు, రచయిత