బిహార్‌లో 11 మంది విదేశీయులకు కరోనా సోకినట్లు తేలింది. గయ విమానాశ్రయంలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో వారికి పాజిటివ్‌గా గుర్తించారు. దాంతో ఉలిక్కిపడిన వైద్య శాఖ వెంటనే అప్రమత్తమైంది.
బౌద్ధ మతగురువు దలైలామా ఈ నెల 29,30,31 తేదీల్లో బుద్ధగయలో ఉపన్యసించనున్నారు. ఈ కార్యక్రమం కోసం వేరు వేరు దేశాల నుంచి భక్తులు గయకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో వైద్య వర్గాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. గయ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ వంటి పలు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాయి. వారిలో కొందరిని పరీక్షించగా 11 మంది కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. అయితే వీరెవరికీ లక్షణాలు లేవని సమాచారం.
11 మంది విదేశీయులకు కరోనా.. అందరూ ఆ ప్రోగ్రామ్‌కు వచ్చినవారే! - భారత్ కొత్త వేరియంట్ కేసులు
బిహార్‌కు చేరుకున్న 11 మంది విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యశాఖ అప్రమత్తమై.. అందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
కరోనా కేసులు
గయలో వారు బుక్ చేసుకొన్న హోటల్లోనే వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దలైలామా ఉపన్యాసం కోసం విదేశాల నుంచి వచ్చే మరింత మందిలో.. కరోనా లక్షణాలు ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వైద్య వర్గాలు అప్రమత్తమయ్యాయి.
Last Updated : Dec 26, 2022, 6:49 PM IST