జర్మనీ అబ్బాయి.. రష్యా అమ్మాయి.. భారత్లో పెళ్లి Foreign couple wedding in Gujarat: సనాతన సంప్రదాయాన్ని విస్మరించి.. పాశ్చాత్య పోకడలపై ఇప్పటి యువత ప్రేమ పెంచుకుంటున్న తరుణంలో ఓ విదేశీ జంట ఆదర్శంగా నిలిచింది. ఎలాంటి బంధం లేని భారత్కు వచ్చి.. అడుగడుగునా హిందూ సంప్రదాయం ఉట్టిపడే రీతిలో పెళ్లి చేసుకుంది. భారతీయులు చూపించిన ప్రేమానురాగాలకు మంత్రముగ్ధులైపోయింది.
జర్మనీ అబ్బాయి.. రష్యా అమ్మాయి.. భారత్లో పెళ్లి! హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జర్మన్ వ్యాపారవేత్త కుమారుడు క్రిస్ ముల్లర్, రష్యా అమ్మాయి జూలియా ఉఖ్వారకటినా వివాహ వేడుకలు.. గుజరాత్ సాబర్కంటా జిల్లాలోని సకరోడియా గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ నెల 21న.. హిందూ సంప్రదాయం ప్రకారం ముల్లర్, జూలియా ఒక్కటయ్యారు. తన జీవితంలో ఇదొక ప్రత్యేకమైన అనుభూతి అని, భారతీయ సంప్రదాయంపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు ముల్లర్.
"వివాహ వేడుకలు చేసుకోవడం కోసమే మేము ఇండియాకు వచ్చాము. మాకు ఇది ఎంతో ప్రత్యేకమైనది. పాశ్చాత్య వివాహ సంప్రదాయాలు నాకు ఎప్పుడూ నచ్చేవి కావు. అక్కడి సంప్రదాయాల్లో.. ఆధ్యాత్మిక భావన ఉండదని నా అభిప్రాయం. నా గురువు భారతీయుడు. అందుకే ఇక్కడ వివాహం చేసుకోవడం ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నాను. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నా. జీవతం మొత్తం ఈ జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి. ప్రజల స్నేహం, ఇక్కడి వాతావరణం, ఆధ్యాత్మికతతో ఇక్కడి వారికి ఉన్న అనుబంధం.. ఇలా ప్రతి విషయం నాకు ప్రత్యేకంగా అనిపించింది."
--- క్రిస్ ముల్లర్ ,వరుడు.
Foreign couple wedding in India: పెళ్లి వేడుకలకు ముల్లర్ ఎన్ఆర్ఐ మిత్రుడు అన్ని ఏర్పాట్లు చేశారు. హిందూ సంప్రదాయంపై మక్కువతో విదేశీయులు తమ గ్రామానికి వచ్చి పెళ్లి చేసుకోవడాన్ని స్థానికులు ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు. వారి వివాహ వేడుకకు తరలివెళ్లి దంపతులను ఆశీర్వదించారు.
ఇదీ చూడండి:-అమలిన ప్రేమ.. 65 ఏళ్ల వయసులో ఒక్కటైన జంట