మహారాష్ట్ర రాజధాని ముంబయిలో భారీగా విదేశీ సిగరెట్లు పట్టుబడినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు తెలిపారు. నగరంలోని నావా షెవా పోర్టుకు సమీపంలో కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ వద్ద రూ.4.75 కోట్లు విలువైన 21.60 లక్షల విదేశీ సిగరెట్లను సీజ్ చేసినట్లు చెప్పారు. వీటిని దుబాయి నుంచి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న వెల్లడించారు.
రూ.4.75 కోట్లు విలువైన విదేశీ సిగరెట్లు పట్టివేత
ముంబయిలో రూ.4.75 కోట్లు విలువైన 21 లక్షలకుపైగా విదేశీ సిగరెట్లను సీజ్ చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్ఐ) తెలిపింది. వాటిని దుబాయి నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడించింది.
రూ.4.75 కోట్లు విదేశీ సిగరెట్టులు పట్టివేత
అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని డీఆర్ఐ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:'ఈ ఏడాది మరో 14 అంతరిక్ష ప్రయోగాలు'
Last Updated : Feb 28, 2021, 9:19 PM IST