తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గిన్నిస్'​​లో ఫ్రీ స్టైల్​ ఫుట్​బాలర్ డబుల్​ ధమాకా - ఫ్రీ స్టైల్​ ఫుట్​బాలర్​ ప్రణబ్ రికార్డు

మెస్సీ, రొనాల్డోలాగా భిన్నమైన శైలిలో గోల్స్ చేసి రికార్డు సృష్టించేందుకు యత్నించలేదు ఆ యువకుడు. తనకంటూ ఓ స్టైల్​ ఉందని నిరూపించుకున్నాడు. రెండు సార్లు గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించాడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు?

Footballer sets world record for second time
రెండు సార్లు గిన్నిస్​లోకెక్కిన ఫ్రీ స్టైల్​ ఫుట్​బాలర్

By

Published : Jan 11, 2021, 7:51 AM IST

ఫ్రీ స్టైల్​ ఫుట్​బాలర్​గా రికార్డు సృష్టించిన ప్రణబ్ భోపాలే

మహారాష్ట్ర కొల్హాపూర్​కు చెందిన ఓ ఫ్రీ స్టైల్​ ఫుట్​బాలర్ రెండు సార్లు గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లోకెక్కాడు. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఈ ఘనతను సాధించాడు. ఇంతవరకు ఫుట్​బాల్​తో ఈ తరహా రికార్డు సాధించినవారెవరూ లేకపోవడం విశేషం.

ఒక్క నిమిషంలో 81 సార్లు..

ముక్కు, నుదుటిపై ఫుట్​బాల్​ ఆడిస్తూ రెండు సార్లు గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించాడు మహారాష్ట్రకు చెందిన ప్రణబ్ భోపాలే. నిమిషం వ్యవధిలో 81 సార్లు ఫుట్​బాల్​ను బ్యాలెన్స్​ చేశాడు.

మూడేళ్ల నుంచి..

ప్రణబ్​ గత మూడేళ్ల నుంచి ఫ్రీ స్టైల్​ ఫుట్​బాల్​ సాధన​ చేస్తున్నాడు. అందులో భిన్నమైన మెళకువలు నేర్చుకుంటున్నాడు. అయితే.. ఫుట్​బాల్​తో ఈ తరహా రికార్డు సాధించిన ఏకైక వ్యక్తి ప్రణబ్ కావడం గమనార్హం. ప్రణబ్ తొలుత 2020 ఆగస్టులో ఫ్రీ స్టైల్​ ఫుట్​బాలర్​గా ఓ రికార్డు నెలకొల్పాడు.

ఈ రికార్డు సాధించేందుకు తాను రోజుకు 8 గంటలు కష్టపడ్డట్లు ప్రణబ్ తెలిపాడు. తల్లితండ్రుల సహకారం వల్లే ఇది సాధ్యమైందని చెప్పాడు.

ఇదీ చదవండి:సౌరశక్తి చుట్టూ దేశం- ఇంధన రంగంలో నవశకం

ABOUT THE AUTHOR

...view details