గంగానది ప్రక్షాళన కోసం.. 'అతుల్య గంగ మిషన్' పేరిట చేపట్టిన కాలినడక కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు 5,900 కిలోమీటర్లు ప్రయాణించిన వ్రిక్షమాల్ అభియాన్, ముంద్మల్ గంగ పరిక్రమ సభ్యులు బుధవారం ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. జూసి సముద్ర కూప్ వద్ద గంగా నదికి మహా హారతి ఇచ్చి కాలినడక కార్యక్రమాన్ని ముగించినట్లు పేర్కొన్నారు.
2020లోనే..
గతేడాది డిసెంబర్ 15న ప్రయాగ్రాజ్ నుంచి ఈ కాలినడక కార్యక్రమాన్ని ప్రారంభించారు అతుల్య గంగ మిషన్ వ్యవస్థాపకులు, ఆర్మీ మాజీ అధికారి గోపాల్ శర్మ. లెఫ్ట్నెంట్ కల్నల్ హేమ్ లోహ్మి, కల్నల్ మనోజ్ కేశ్వార్ ఇందులో కీలక పాత్ర పోషించారు. గంగానది పరిరక్షణ గురించి ప్రజలకు తెలిసేలా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నది సమీప గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి గంగా నది పరిశుభ్రతపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.
"గంగా నదిని సంరక్షించుకోవడానికి ప్రజలు, ప్రభుత్వం ఐక్యంగా పనిచేయాలి. జల ప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రజలదే. ఈ అతుల్య గంగ మిషన్తో పాటు.. వ్రిక్షమాల్ అభియాన్ పేరిట విజయ్ మిశ్రా, కాలేశ్వర్ మిశ్రా ఆధ్వర్యంలో 'గ్రీన్ ఇండియా ఫౌండేషన్' పేరిట కార్యక్రమాలు చేపట్టాం."