Food Poisoning in Karnataka: కర్ణాటక దావణగెరె జిల్లాలోని ఇందిరాగాంధీ ఎస్సీ రెసిడెన్సియల్ పాఠశాలలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అరబట్టే గ్రామంలో ఉన్న ఈ పాఠశాలలో శుక్రవారం రాత్రి విద్యార్థులు భోజనం చేశాక వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో అధికారులు వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కలుషిత ఆహారంతో అస్వస్థకు గురైన చిన్నారులు ఆస్పత్రికి విద్యార్థుల తరలింపు "కలుషిత ఆహారం కారణంగానే విద్యార్థులు ఆస్వస్థకు గురయ్యారు. విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది."
-వైద్యులు, హొన్నాలీ ఆస్పత్రి
స్థానిక ఎమ్మెల్యే రేణుకాచార్య ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అవసరం ఉంటే మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలిస్తామని అన్నారు.
అంబులెన్స్‌లో విద్యార్థుల తరలింపు ఆస్పత్రికి చేరిన స్థానిక ఎమ్మెల్యే రేణుకాచార్య పరిస్థితిని సమీక్షిస్తున్న ఎమ్మెల్యే రేణుకాచార్య ఇదీ చదవండి:జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత