Food Made In Concrete Mixer: మధ్యప్రదేశ్, మోరెనా జిల్లా చంబల్ ప్రాంతంలోని మౌనీ బాబా ఆశ్రమంలో అతిపెద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భగవత్ కథా చివరి రోజు సందర్భంగా శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 2 లక్షలకుపైగా భక్తులు పాల్గొని భోజనం చేశారు.
కాంక్రీట్ మిక్సర్ యంత్రంలో పిండి కలిపి..
లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకావడం వల్ల ఆహారం త్వరగా తయారు చేసేందుకు కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని ఉపయోగించారు. మల్పువా(ఓ రకం మిఠాయి) పిండిని కాంక్రీట్ మిక్సర్ యంత్రంలో వేసి కలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. 15 ట్రాలీల సాయంతో భోజనం సరఫరా చేశారు.