తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్విగ్గీలో కాఫీ ఆర్డర్.. బద్దకంతో డెలివరీ బాయ్‌ 'స్మార్ట్​ ప్లాన్'​! - స్విగ్గీబాయ్​ కాఫీ

Swiggy Delivery Boy: ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన కాఫీని కేఫ్​ దగ్గర పికప్​ చేసుకున్న తర్వాత.. ఆ డెలివరీ బాయ్​ మనసు మారింది. ''అబ్బా.. ఓపిక లేదు.. అంత దూరం వెళ్లి ఇవ్వాలా? ''అని అనుకున్నాడేమో. బైక్‌పై కస్టమర్‌ ఇంటికి వెళ్లి.. కాఫీ ఇవ్వడానికి బద్దకంగా ఉందని మరో టెక్నిక్ ఉపయోగించాడు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే?

food-delivery-boys-swag-delivered-coffee-via-dunzo
food-delivery-boys-swag-delivered-coffee-via-dunzo

By

Published : May 8, 2022, 10:12 AM IST

Swiggy Delivery Boy: ప్రస్తుత రోజుల్లో ఏం కావాలన్నా మార్కెట్లకు వెళ్లి కొనే సమయం లేక అందరూ ఆన్​లైన్​ యాప్​ల్లోనే ఆర్డరు పెట్టేస్తున్నారు. ఒక్క ఫుడ్​ మాత్రమే కాదు.. ప్రతి ఒక్క వస్తువు ఆన్​లైన్​లో దొరికేస్తుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. నవ్వులు పూయించే వ్యవహారాలు బయటకు వస్తుంటాయి. తాజాగా బెంగుళూరులో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి స్విగ్గీలో కాఫీ ఆర్డర్ ఇస్తే.. డెలివరీ బాయ్ ఏం చేశాడో తెలుసా? తాను డెలివరీ చేయకుండా.. బద్ధకంతో మరో యాప్ ద్వారా ఇంకో డెలివరీ బాయ్‌తో కాఫీని పంపించాడు.

అబ్బా.. ఓపిక లేదు.. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి స్విగ్గీలో కేఫ్ కాఫీ డే(సీసీడీ) అవుట్‌లెట్‌‌లో కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ ఓ డెలివరీ బాయ్‌కు వెళ్లింది. అతడు కాఫీని పికప్ చేసుకునేందుకు సీసీడీ అవుట్‌లెట్‌కు వెళ్లాడు. కాఫీ తీసుకున్న తర్వాత.. తన మనసు మారింది. ''అబ్బా.. ఓపిక లేదు.. అంత దూరం వెళ్లి ఇవ్వాలా? '' అని అనుకున్నాడు. బైక్‌పై కస్టమర్‌ ఇంటికి వెళ్లి.. కాఫీ ఇవ్వలేక.. బద్ధకంతో టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. 'డుంజో' అనే మరో యాప్‌ ద్వారా ఇంకో డెలివరీ బాయ్‌ను ఎంచుకున్నాడు. అతడు లొకేషన్‌కు రాగానే.. భయ్యా.. ఈ ఆర్డర్‌ను డెలివరీ చేయమని చెప్పి డబ్బులిచ్చాడు. అనంతరం డుంజో డెలివరీ బాయ్ ఆ ఆర్డర్‌ తీసుకెళ్లి కస్టమర్‌కు అందజేశాడు.

5 స్టార్​ రేటింగ్​ ఇవ్వు భయ్యా.. కాసేపటి తర్వాత స్విగ్గీ డెలివరీ బాయ్ నుంచి ఆ కస్టమర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. "మీ ఆర్డర్‌ పికప్ చేసుకొని.. డుంజో చేశాను.. ప్లీజ్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి" అని కోరాడు. కాఫీ ఆర్డర్ చేసిన ఆ వ్యక్తి తన స్నేహితుడితో దీని గురించి వాట్సాప్‌లో చర్చించగా.. ఆ స్క్రీన్‌ షాట్‌ను ఓంకార్ జోషి అనే వ్యక్తి ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. అది వైరల్‌గా మారింది.

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. వారెవ్వా.. ఏం తెలివి రా బాబూ! ..అని కామెంట్స్ చేస్తున్నారు. నువ్వే డెలివరీ బాయ్ అంటే!.. నువ్వు ఇంకో డెలివరీ బాయ్‌ ద్వారా ఆర్డర్ ఇస్తావా? మహానుభావుడివి అని నెటిజన్లు సరదాగా ట్వీట్స్ చేస్తున్నారు. మరి కాఫీ చల్లారిపోయిందా.. ఇంకా వేడిగానే ఉందా ? అని మరికొందరు ఆటపట్టిస్తున్నారు.

డుంజో ట్వీట్​
స్విగ్గీ ట్వీట్​
నెటిజన్​ ట్వీట్
మరో నెటిజన్​ ట్వీట్​

డుంజో కూడా స్విగ్గీ లాంటిదే. డుంజోలో కూరగాయలు, నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ డెలివరీతో పాటు ఇతర పార్సిల్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఏదైనా ప్యాకేజీని ఇచ్చి వేరే చోటుకు డెలివరీ చేయమని చెబితే.. తీసుకెళ్లి ఇచ్చేస్తారు. ఆ డెలివరీ సర్వీసునే ఇప్పుడు స్విగ్గీ బాయ్ ఉపయోగించుకుని వైరల్​ అయ్యాడు.

ఇదీ చదవండి:లోకో పైలట్ సాహసం.. రైల్వే మంత్రి ప్రశంసల వర్షం

ABOUT THE AUTHOR

...view details