Fog Effect On Planes in Hyderabad :తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయినా వాతావరణం పొగ మంచుతో కప్పుకుని ఉంటోంది. పొగమంచుతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక పాఠశాలలు, కళాశాలలు, ఆఫీసులు, ఇతర పనుల మీద బయటకు వెళ్లే వారు ఈ పొగమంచులోనే గజగజ వణుకుతూ వెళ్తున్నారు.
Flights Diverted From Shamshabad Airport : పొగ మంచుతో ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులే కుండా విమాన రాకపోకలకూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ దృష్ట్యా శంషాబాద్‌లోని పొగమంచు కారణంగా, ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 30 విమానాలను అధికారులు దారి మళ్లించారు. శంషాబాద్‌లో దిగాల్సిన 3 విమానాలు గన్నవరంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. చండీగఢ్, గోవా, తిరువనంతపురం నుంచి ఈ మూడు వచ్చాయి. అదే విధంగా బెంగళూరు-హైదరాబాద్ విమానం తిరిగి బెంగళూరుకు పంపారు.
మంచు తుపాను బీభత్సం.. స్తంభించిన రవాణా, విమానాలు రద్దు
మరోవైపు ముంబయి-హైదరాబాద్ విమానం తిరిగి ముంబయికి పంపించారు. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌కు రావాల్సిన విమానాలను ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లిస్తున్నారు. ఎయిర్ ఇండియా, విస్తారా, స్పైస్ జెట్, స్టార్ అలయన్స్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల అధికారులు మళ్లించారు. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని విమానయాన అధికారులు చెబుతున్నారు. మరోవైపు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.