తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దాణా స్కామ్​ ఐదో కేసులోనూ లాలూ దోషి- త్వరలోనే మళ్లీ జైలుకు..

Fodder scam
Fodder scam: RJD chief Lalu Prasad Yadav convicted

By

Published : Feb 15, 2022, 11:59 AM IST

Updated : Feb 15, 2022, 12:32 PM IST

11:55 February 15

దాణా స్కామ్​ ఐదో కేసులోనూ లాలూ దోషి- త్వరలోనే మళ్లీ జైలుకు..

Fodder scam: దాణా కుంభకోణం కేసులో ఆర్​జేడీ అధినేత, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​ దోషిగా తేలారు. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఈమేరకు తీర్పు చెప్పింది. ఫిబ్రవరి 18న ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో మరో 36 మందికి మూడేళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది సీబీఐ స్పెషల్​ కోర్టు.

దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. దోరండా ఖజానా నుంచి రూ.139.35కోట్లు దుర్వినియోగం కేసు ఐదోది, చివరిది. ఈ కేసులో మొత్తం 170 మంది నిందితులు కాగా.. 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వం తరఫున సాక్షులుగా మారారు. ఇద్దరు నేరం అంగీకరించారు. ఆరుగురు పరారీలో ఉన్నారు. చివరకు లాలూ సహా మొత్తం 99 మంది నిందితులపై ఫిబ్రవరి నుంచి విచారణ జరిపిన రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ జనవరి 29న తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. మంగళవారం లాలూను దోషిగా తేల్చింది.

950 కోట్ల కుంభకోణం..

అవిభాజ్య బిహార్​కు లాలూ ప్రసాద్​ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.950కోట్ల దాణా కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. 1996 జనవరిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లాలూను నిందితునిగా పేర్కొంటూ 1997 జూన్​లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత సుదీర్ఘ విచారణ జరిగింది. లాలూతోపాటు బిహార్ మాజీ సీఎం జగన్నాథ్​ మిశ్రాపైనా సీబీఐ అభియోగాలు మోపింది.

దుమ్కా, దేవ్​ఘడ్​, ఛాయ్​బసా ఖజానాల నుంచి నిధుల దుర్వినియోగానికి సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. ఆయనకు మొత్తం 14 ఏళ్లు శిక్ష, రూ.60లక్షల జరిమానా పడింది.

2013 సెప్టెంబర్​లో దోషిగా తేలి, తొలిసారి రాంచీ జైలుకు వెళ్లారు లాలూ. 2013 డిసెంబర్​లో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది బయటకు వచ్చారు. అయితే.. 2017 డిసెంబర్​లో మరో కేసులో దోషిగా తేలగా.. లాలూ బిర్సా ముండా జైలుకు వెళ్లారు. 2021 ఏప్రిల్​లో ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ఇవీ చూడండి:వయసు 60+.. 14 మందికి భర్త.. 7 రాష్ట్రాలకు అల్లుడు.. చివరకు..

'ఆయనకు పిల్లలు లేరు.. ఈయనకు ఉన్నా...'.. మోదీపై లాలూ సెటైర్

Last Updated : Feb 15, 2022, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details