దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పలువురు కాంగ్రెస్ నేతలు. ప్రాజెక్టుల నిర్వహణకు బదులు.. ఆరోగ్య సేవలు, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్‌పై శ్రద్ధ వహిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కేంద్రానికి చురకలు అంటించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించడాన్ని తప్పుపట్టారు.
"రానున్న రోజుల్లో పరిస్థితి మరింత కఠినతరమవుతుంది. ఈ పరిణామాన్ని ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులు భరించలేనివి."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
దేశంలో కొత్తగా 3.46 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,624 మంది వైరస్‌కు బలయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్ ట్వీట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది.