తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బడ్జెట్​ 2021-22: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ షెడ్యూల్​ ఇదే..

2021-22 వార్షిక బడ్జెట్​ ఇవాళ పార్లమెంటు ముందుకు రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. లోక్​సభలో ఉదయం 11 గంటలకు పద్దును ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు.. రాష్ట్రపతిని కలవనున్నారు. మరి బడ్జెట్​ వేళ.. ఆర్థిక మంత్రి షెడ్యూల్​ తెలుసుకుందాం.

FM NIRMALA SITARAMAN
ఆర్థిక మంత్రి నిర్మలమ్మ షెడ్యూల్​ ఇదే

By

Published : Feb 1, 2021, 6:32 AM IST

Updated : Feb 1, 2021, 8:30 AM IST

కరోనా మహమ్మారి వేళ ఆశల పద్దును పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే ముందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్​ భేటీ కానుంది. అంతకంటే ముందు రాష్ట్రపతిని కలవనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఉదయం 11 గంటలకు లోక్​సభలో వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు.

  • ఉదయం 8.45 గం. : తన నివాసం నుంచి నేరుగా పార్లమెంట్​ నార్త్​ బ్లాక్​లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి బయల్దేరుతారు నిర్మలా సీతారామన్​.
  • ఉదయం 9.00: నార్త్​ బ్లాక్​లోనే ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​తో నిర్మల భేటీ
  • ఉదయం 9.30: రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిసి, బడ్జెట్​ మొదటి ప్రతిని అందించనున్నారు నిర్మలా సీతారామన్​.
  • ఉదయం 10.00: బడ్జెట్​ ప్రతులతో నిర్మలా సీతారామన్​, అనురాగ్​ ఠాకూర్​ పార్లమెంటుకు బయల్దేరుతారు.
  • ఉదయం 10.15: పార్లమెంటులోని గేట్​ నెం.1కు చేరుతారు.
  • ఉదయం 10.30: బడ్జెట్​, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్​ సమావేశం కానుంది.
  • ఉదయం 11.00:లోక్​సభలో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్​.

ఈసారి పార్లమెంట్​ బడ్జెట్​ సెషన్​(తొలి భాగం) ఫిబ్రవరి 13నే ముగియనున్నట్లు తెలుస్తోంది. అనంతరం.. మార్చి 8- ఏప్రిల్​ 8 మధ్య రెండో సెషన్​ నిర్వహించనున్నారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు రాజ్యసభ సమావేశాలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి.

Last Updated : Feb 1, 2021, 8:30 AM IST

ABOUT THE AUTHOR

...view details