జమ్ముకశ్మీర్ అర్ణియా సెక్టార్ వద్ద ఓ డ్రోన్(Drone in jammu) కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఎగురుతున్న డ్రోన్‌ను గుర్తించిన సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్) దానిపై కాల్పులు జరిపింది.
భారత భూభాగంలోనే సుమారు రెండువందల మీటర్ల ఎత్తులో ఎరుపురంగు కాంతితో మెరుస్తున్న వస్తువు కనిపించిన బీఎస్‌ఎఫ్ అధికారులు.. వెంటనే దానిపైకి కాల్పులు జరిపినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆ వస్తువు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిందన్న అధికారులు.. ఆ ప్రాంతంలో గాలించినప్పటికీ ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదని పేర్కొన్నారు.