తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమర్​నాథ్​ గుహ వద్ద వరద బీభత్సం.. పలువురు మృతి!

జమ్ముకశ్మీర్​లో కుండపోత వర్షాలతో అమర్​నాథ్​ గుహ వద్ద ఆకస్మిక వరదలు పోటెత్తాయి. కొండల పైనుంచి వర్షపు నీరు ముంచెత్తగా.. పలువురు గల్లంతయ్యారని తెలిసింది. ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​, ఐటీబీపీ సహా ఇతర సంస్థలు కలిసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఐదుగురు మరణించారని అధికారులు ప్రకటించారు. అయితే మరణాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

amarnath floods
అమర్​నాథ్​ గుహ వద్ద వరద బీభత్సం.. పలువురు మృతి!

By

Published : Jul 8, 2022, 7:15 PM IST

Updated : Jul 8, 2022, 8:15 PM IST

పవిత్ర అమర్‌నాథ్‌ యాత్రలో ప్రకృతి ఊహించని రీతిలో విరుచుకుపడింది. ప్రతికూల వాతావరణం మధ్య సాగే పవిత్ర అమర్‌నాథ్‌ యాత్రలో ఈ ఏడాది అందుకు తగ్గట్లే ప్రకృతి ప్రకోపించింది. స్వల్ప వ్యవధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా గుహ వద్ద భారీ వరద ముంచెత్తింది. సాయంత్రం అయిదున్నర గంటల ప్రాంతంలో ఊహించని రీతిలో కొండలపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద నీరు దూసుకువచ్చింది. వరద గుహకు సమీపంలోని యాత్రికుల టెంట్లను చుట్టుముట్టింది. అనేక టెంట్లు కొట్టుకుపోయాయి. ఊహించని పరిణామానికి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు ఐటీబీపీ తెలిపింది. అయితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆకస్మిక వరద సమాచారం అందుకున్న ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​, ఐటీబీపీ సహా ఇతర సంస్థలు కలిసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు.

అమర్​నాథ్​ గుహ వద్ద వరద బీభత్సం.. పలువురు మృతి!
అమర్​నాథ్​ గుహ వద్ద వరద బీభత్సం.. పలువురు మృతి!

ఇదీ చదవండి:పేదింటి విద్యార్థికి రూ.2.5కోట్ల స్కాలర్​షిప్​.. అమెరికాలో ఉన్నత విద్య

Last Updated : Jul 8, 2022, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details