రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ వాయనాడ్ లోక్సభ స్థానంలో ఆందోళనలు చెలరేగాయి. వరద సహాయార్థం పంచిపెట్టాల్సిన కిట్లు లభ్యమవ్వడం.. ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎంపీ ల్యాడ్ నిధులతో వచ్చిన ఈ కిట్లను తక్షణమే పంచి పెట్టాల్సి ఉండగా.. నీలంబుర్ సమీపంలోని ఓ దుకాణంలో కాంగ్రెస్ నేతలు దాచి పెట్టారని స్థానికులు, సీపీఎం నేతలు నిరసన చేపట్టారు.
ప్రజలకు కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని సీపీఎం అనుబంధ విభాగమైన డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కిట్ల అంశంపై దర్యాప్తు జరపాలని నీలంబుర్ ఎమ్మెల్యే పీవీ అన్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం వెలుగులోకి రాగానే కిట్లను కాంగ్రెస్ నేతలు తరలించారని అన్నారు.
"ఇది వదిలిపెట్టే అంశం కాదు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేందుకు ఆహార పదార్థాలు, దుస్తులు సహా ఇతర కిట్లను కాంగ్రెస్ నాయకులు దాచిపెట్టారు. ఈ అంశంపై కలెక్టర్ విచారణ జరపాలి. కేరళ పీసీసీ అధ్యక్షుడు ముల్లప్పల్లి రామచంద్రన్ ఈ విషయంపై సమాధానం ఇవ్వాలి."