Flipkart Big Billion Days Sale 2023 Latest Update :దేశంలో వరుస పండగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక సేల్స్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ప్రియులను, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, ట్యాబ్స్, స్మార్ట్ వాచ్‌లు(Smart Watches) కొనుగోలు చేసే విద్యార్థులను, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు కొనుగోలు చేసే వారిని ఆకట్టుకోవడానికి ఆయా వస్తువులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి.
Flipkart Big Billion Days Sale 2023 :అయితే.. ఫ్లిప్ కార్ట్ అదనంగా వినియోగదారులను తమ వైపు తిప్పుకోవడానికి.. క్రెడిట్ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్స్ ప్రకటించింది. అలాగే పేటీఎం, ఇతర యూపీఐ వాలెట్ బేస్డ్ ఆఫర్లనూ అందిస్తోంది. అదేవిధంగా.. ఈఎంఐ ఆప్షన్లు ఎంచుకున్నా వాటిపై కూడా అదిరిపోయే ఇన్స్టంట్ డిస్కౌంట్లు (ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023(Flipkart Big Billion Days Sale) అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఏయే బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఎంత మేర డిస్కౌంట్స్ ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Banks Offering Special Discounts on Flipkart Big Billion Days Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 అక్టోబర్ 8వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంతకుముందులాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యత్వం ఉన్న వారికి 24 గంటల ముందే ఈ సేల్‌లోని ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్ అక్టోబర్ 15 వరకు కొనసాగనుంది. అంటే ఇక మూడు రోజులే ఈ ప్రత్యేక సేల్ ఉండనుంది. కాబట్టి వినియోగదారులు ఇప్పుడే ఈ సేల్‌లో వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డులు(Credit Cards)అందిస్తున్న స్పెషల్ డిస్కౌంట్స్‌ని వినియోగించుకుని.. కొనుగోలు చేసే వస్తువుపై భారీ తగ్గింపుని పొందొచ్చని సంస్థ ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ప్రత్యేక తగ్గింపును అందిస్తున్న బ్యాంకులివే..
యాక్సిస్ బ్యాంక్ :కార్డ్ ఇన్సైడర్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు బిగ్ బిలియన్ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కార్డు ద్వారా రూ. 5,000 కంటే ఎక్కువ జరిపే లావాదేవీలు, క్రెడిట్ EMI లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు. గరిష్ఠంగా ఈ తగ్గింపు రూ.1,250 వరకు లభిస్తుంది. అలాగే.. ఈ కార్డు వినియోగదారులు అదనంగా, రూ.24,990 కంటే ఎక్కువ నెట్ కార్ట్ విలువ కలిగిన ఆర్డర్లపై ఫ్లాట్ రూ.750 డిస్కౌంట్ అందిస్తారు. రూ. 79,990 కంటే ఎక్కువ నికర కార్ట్ విలువ కలిగిన ఆర్డర్లపై ఫ్లాట్ రూ.3,000 తగ్గింపును పొందవచ్చు. అయితే.. ఈ ఆఫర్లు యాక్సిస్ బ్యాంక్ కార్పొరేట్, కమర్షియల్ కార్డ్‌లకు వర్తించవనే మీరు గమనించాలి.