తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎం విమానం ల్యాండింగ్​లో ఇబ్బంది- అంతా టెన్షన్ టెన్షన్​! - కర్ణాటక వార్తలు తాజా

Flight Basavaraj Bommai: ప్రతికూల వాతావరణం కారణంగా కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై ప్రయాణిస్తున్న విమానం ల్యాండయ్యే సమయంలో ఇబ్బంది ఎదురైంది. ఫలితంగా చాలా సేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ ఫ్లైట్​లో కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషి కూడా ఉన్నారు.

basavaraj bommai
కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై

By

Published : Dec 10, 2021, 3:32 PM IST

Flight Basavaraj Bommai: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషికి ప్రమాదం తప్పింది. మరికొద్దిసేపట్లో వీరు ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్​ అవ్వాల్సి ఉందనగా ఇబ్బంది ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా వీరు ప్రయాణిస్తున్న ఫ్లైట్​ అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. బెంగళూరు నుంచి హూబ్లీకి బయలుదేరిన ఈ విమానం ఉదయం 7.30కి ల్యాండ్​ అవ్వాల్సి ఉండగా ఆలస్యమైంది.

'నేను ఓటు వేయడానికి వచ్చాను. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణం ఆలస్యమైంది' అని బొమ్మై వెల్లడించారు.

కర్ణాటకలో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హవేరీ జిల్లాలోని శిగ్గావ్​లో ముఖ్యమంత్రి శుక్రవారం తన ఓటును వినియోగించుకున్నారు.

ఇదీ చూడండి :హెలికాప్టర్ ప్రమాదంపై అవేవీ నమ్మొద్దు: వాయుసేన

ABOUT THE AUTHOR

...view details