Gang rape minor girl: అసోం రాజధాని గువహటిలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఐదుగురు యువకులు ఆ చిన్నారిని ఓ గదిలో బంధించి.. ఈ ఆకృత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అత్యాచారం చేసేటప్పుడు వీడియో కూడా తీశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తామని బెదిరించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ జరిగింది..
ఫిబ్రవరి 19న ఓ బాలికను కొందరు యువకులు ఎవరూ లేని.. ప్రదేశానికి రమ్మని చెప్పారు. అక్కడకు వెళ్లిన ఆ అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేశారు. ఇదే సమయంలో వారి వద్ద ఉన్న ఫోన్లతో వీడియోలు తీశారు. అనంతరం ఆ బాలికను గువహటిలోని ఓ హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి మరోసారి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికి అయినా చెప్తే ఈ వీడియోలను నెట్టింట వైరల్ చేస్తామాని బెదిరించారు. అనంతరం ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు మార్చి 8 వ తేదీన ఆల్ ఉమన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.