మధ్యప్రదేశ్లోని శేవోపుర్లో జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.
ఏం జరిగిందంటే..
విజయ్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక.. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తన ఇంటి బయట ఆడుకుంటోంది. ఈ క్రమంలో.. సూరజ్ అనే 20 ఏళ్ల వ్యక్తి.. చిన్నారికి మాయమాటలు చెప్పి, సమీపంలోని ఆవతోటలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడుస్తూ ఇంటికి వచ్చిన చిన్నారి.. జరిగిన విషయం తన తల్లికి చెప్పింది. ఈ మేరకు బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.