తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బుల్లి ట్రెక్కర్.. ఐదేళ్లకే కొండను ఎక్కేసి రికార్డ్!

3,200 అడుగుల ఎత్తైన పర్వతాన్ని అలవోకగా ఎక్కేసి.. వాహ్ అనిపించింది మహారాష్ట్రకు (Trekking in Maharashtra) చెందిన చిన్నారి. ఐదేళ్ల వయసులోనే ట్రెక్కింగ్ చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది. మలంగ్​గఢ్ అనే (Malanggad Trek) కొండను అతి చిన్న వయసులో అధిరోహించి.. రికార్డు సృష్టించింది.

By

Published : Nov 11, 2021, 4:33 PM IST

Updated : Nov 11, 2021, 4:57 PM IST

arna ipper mountain climbing
బుల్లి ట్రెక్కర్.. ఐదేళ్లకే కొండను ఎక్కేసి రికార్డ్..

బుల్లి ట్రెక్కర్.. ఐదేళ్లకే కొండను ఎక్కేసి రికార్డ్!

'ఐదేళ్లు...' ఎవరైనా ఈ వయసులో ఇంటి దగ్గరే ఉంటూ ఆడుకుంటారు. లేదా అమ్మ కొంగు చాటున దాక్కొని మారాం చేస్తుంటారు. కానీ మహారాష్ట్రకు చెందిన ఈ చిన్నారి అలా కాదు. ఐదేళ్లకే సాహసాలకు సై అనేసింది. మలంగ్​గఢ్​ అనే పర్వతాన్ని (Trekking in Maharashtra) ఎక్కేసింది. అతిపిన్న వయసులో ఈ కొండను అధిరోహించిన వ్యక్తిగా చరిత్ర లిఖించింది.

చిన్నారి అర్ణా ఇప్పర్

నాశిక్​కు చెందిన ఈ బుల్లి పర్వతారోహకురాలి పేరు అర్ణా ఇప్పర్. చిన్నపిల్ల పర్వతారోహణ చేసిందంటే అదేదో సాదాసీదా పర్వతం అనుకుంటే పొరపాటే. ఆ కొండ ఎత్తు (Malanggad Trek) ఏకంగా 3,200 అడుగులు. పర్వతం పైకి (Malanggad news) చేరుకోవడంలో భాగంగా.. ట్రెక్కింగ్​, పోల్ క్రాసింగ్ వంటి సాహసాలూ చేసిందీ చిన్నారి. నిపుణులైన పర్వతారోహకులకు దీటుగా ట్రెక్కింగ్​లో పాల్గొంది. అర్ణాకు ఇది మూడో ట్రెక్కింగ్ కావటం మరో విశేషం.

పర్వతారోహకులతో అర్ణ
కొండపైకి ఎక్కుతూ..

ఉరిమే ఉత్సాహంతో..

పర్వతాన్ని ఎక్కే సమయంలో అర్ణ ఎప్పుడూ అలసటకు గురికాలేదని చిన్నారి తండ్రి కిశోర్ ఇప్పర్ చెబుతున్నారు. అందరితో కలిసి ట్రెక్కింగ్​ ఉల్లాసంగా ట్రెక్కింగ్ చేసేదని అంటున్నారు. ఇంత చిన్న వయసులో ధైర్యంగా ట్రెక్కింగ్ చేసిన చిన్నారి సాహసాన్ని అనేక మంది మెచ్చుకుంటున్నారు. భవిష్యత్​లో అర్ణ మరిన్ని రికార్డులు బద్దలు కొడుతుందని ధీమాగా చెబుతున్నారు.

తాళ్లు కట్టుకొని పర్వతారోహణ..

ఇదీ చదవండి:మహిళా పోలీసు సాహసం.. వరద బాధితుడిని భుజాలపై మోసుకెళ్లి..

Last Updated : Nov 11, 2021, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details