విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు.. తరగతి గదిలోనే డాన్స్ చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రా జిల్లాలో జరిగింది. జిల్లాలోని అచ్నేరా బ్లాక్‌లోని సంధాన్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచర్లు.. తరగతి గదిలోనే బాలీవుడ్ పాటలకు నృత్యం చేశారు. అసిస్టెంట్ టీచర్లు రష్మీ సిసోడియా, జీవికకుమారి, అంజలియాదవ్, సుమన్ కుమారి, సుధారాణిలనే ఐదుగురు మహిళా టీచర్లు 'జే మైను యార్ నా మిలే తే మార్ జవాన్' పాటకు డాన్స్ చేశారు.
Viral Video: క్లాస్‌రూమ్‌లో డాన్స్.. టీచర్ల సస్పెండ్ - పాఠశాలలో ఉపాధ్యాయుల డాన్స్ వీడియోలు
ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదిలో టీచర్లు డాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు బాలీవుడ్ పాటలకు నృత్యం చేశారు. ఈ విషయం తెలిసిన విద్యాశాఖ అధికారులు.. పాఠశాలలో అనుచితంగా ప్రవర్తించిన ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆగ్రాలో జరిగింది ఈ ఘటన.
వారిలో ఒకరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. చివరకు విద్యాశాఖ అధికారులకు విషయం తెలిసింది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు పిల్లలను వేరే గదిలో కూర్చోబెట్టి.. డాన్సులు చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు అనుచితంగా ప్రవర్తించి విద్యా శాఖ ప్రతిష్ఠను దిగజార్చారని వారిని సస్పెండ్ చేశారు. డాన్స్ వ్యవహారంపై టీచర్లను, పాఠశాల ప్రిన్సిపాల్ దినేశ్ చంద్ పరిహార్ వివరణ కోరారు.
ఇదీ చూడండి:Kuppuru swamiji: మఠాధిపతిగా 13 ఏళ్ల బాలుడు