తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రాల్లోనే 70శాతం కరోనా కేసులు - 5 రాష్ట్రాల్లోనే 70శాతం కరోనా కేసులు

ఓవైపు కరోనా టీకాల ప్రక్రియ జోరుగా సాగుతుండగానే మరోవైపు కేసులు పెరగడం ఆందోళనకరంగా మారింది. దేశంలో తొలిసారి కరోనా యాక్టివ్​ కేసుల సంఖ్య 11 లక్షలు దాటడం గమనార్హం. అయితే 70శాతం కేసులు 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

five states account for over 70 percent of india active covid 19 cases
ఆ రాష్ట్రాల్లోనే 70శాతం కరోనా కేసులు

By

Published : Apr 11, 2021, 6:29 PM IST

ఒకవైపు వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంటే మరోవైపు అంతే వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తోంది. 70 శాతం కేసులు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. గతేడాది కరోనా తీవ్ర రూపం దాల్చిన తర్వాత తొలిసారి 11లక్షల పాజిటివ్‌ కేసులు నమోదవడం గమనార్హం.

వణుకుతున్న మహారాష్ట్ర..

గత 24 గంటల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య ఏకంగా 61 వేల 456 పెరిగినట్లు ప్రభుత్వ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 48.57శాతం మహారాష్ట్రకు చెందినవే కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న టాప్‌-10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఉన్నాయి. మొత్తం కేసుల్లో 80.92శాతం కేసులు ఈ రాష్ట్రాల నుంచే రావడం ఆందోళన కలిగించే అంశం.

ఇక ఒకరోజులో నమోదయ్యే కేసుల వివరాలు తీసుకుంటే మహారాష్ట్ర 55,411, ఛత్తీస్‌గఢ్‌ 14,098, ఉత్తర్‌ప్రదేశ్‌ 12,748 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో సుమారు 90వేల మంది కరోనా నుంచి కోలుకోగా, 839మంది మృత్యువాతపడ్డారు.

ఇదీ చూడండి:సొంతూళ్లకు వలస కూలీల పయనం.. ఆ భయంతోనే?

ABOUT THE AUTHOR

...view details