దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తమిళనాడు, హరియాణా, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్రలో అమానవీయ ఘటనలు వెలుగు చూశాయి.
ఆరు నెలలు అత్యాచారం..
తమిళనాడు తిరువనంతపురంలో మతిస్తిమితం కోల్పోయిన ఓ మైనర్పై ఆరు నెలలు అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో కడలూరులోని బంధువుల ఇంటివద్ద నివసిస్తున్న బాధితురాలిని పలుమార్లు రేప్ చేశారు.
బాలిక ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో అసలు విషయం బయటపడింది. వెంటనే బాధితురాలి బంధువులు ఆల్-ఉమెన్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
హరియాణాలో ఒడిశా యువతిపై
ఆరు నెలల పాటు వేర్వేరు ప్రాంతాల్లో చాలా మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హరియాణాలోని హిసార్లో జరిగింది.