గుజరాత్ కచ్ జిల్లాలో విషాదం నెలకొంది. నర్మదా కాలువలో పడి ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. స్థానికులు మృతదేహాలను కాలువ నుంచి వెలికితీశారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. వీరంతా వ్యవసాయ కూలీలని చెప్పారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సోమవారం రాత్రి 7 గంటలకు జరిగిందని పోలీసులు తెలిపారు.
కాలువలో మునిగి ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి - నర్మదా కాలువలో మునిగి ఐదుగురు మృతి
గుజరాత్లో ఘోరం జరిగింది. నర్మదా కాలువలో మునిగి ఐదుగురు మరణించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు.
కాలువలో మునిగి ఐదుగురు మృతి