ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు. మరో 16 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ముగ్గురు పోలీస్ అధికారులు, ఓ స్టేషన్ ఇన్ఛార్జ్ను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్ఎస్పీ తెలిపారు.