హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు.
లోయలో పడ్డ కారు- ఐదుగురు దుర్మరణం - లోయలో పడ్డ కారు
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.
లోయలో పడ్డ కారు.. ఐదుగురు దర్మరణం
మంగళవారం మధ్యాహ్నం సుందర్ నగర్లో ఓ దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సారోర్కు చేరుకోగానే కారు అదుపు తప్పింది. 100 మీటర్ల లోయలో దొర్లుకుంటూ వెళ్లి సౌల్ ఖాద్లోని కాలువలో మునిగింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:మంగళూరు తీరంలో పడవ ప్రమాదం- ముగ్గురు మృతి